![]() |
![]() |

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -80 లో.. నిన్ను ఎంతో నమ్మాను.. నీలో నా కొడుకు ప్రేమని చూసుకున్నాను కానీ నువ్వు నాకు నమ్మకద్రోహం చేసావ్.. నాతో ప్రేమగా ఉంటుంటే ఆ రుద్ర ఏం తప్పు చెయ్యలేదని నిరూపించే ప్రయత్నం చేస్తున్నావని గంగపై శకుంతల కోప్పడుతుంది. నేను అలా మీకు నమ్మకద్రోహం చెయ్యలేదని శకుంతల కాళ్లపై పడుతుంది గంగ.
అయిన వినకుండా శకుంతల చిరాకు పడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది. గంగ తన గదివైపు వెళ్తుంటే.. ఏంటి గంగ ఎక్కడికి వెళ్తున్నావ్.. ఇంకా ఇంత జరిగిన కూడా ఇంట్లోకి వెళ్తున్నావ్ ఇంట్లో వాళ్లంతా నీపై చిరాకు పడుతున్నారని గంగతో ఇషిక అంటుంటే.. వెళ్తుందిలే ఇషిక అని వీరు అంటాడు. నాకు సంబంధించిన వస్తువులు పైన ఉన్నాయి.. అవి తీసుకొని రావడానికి వెళ్తున్నానని గంగ అంటుంది. ఆ తర్వాత మణికి వీరు ఫోన్ చేసి గంగని ఇంట్లో నుండి గెంటేసారు.. ఏం చేసుకుంటావో నీ ఇష్టమని చెప్తాడు. మరొకవైపు గంగ వెళిపోతు రుద్ర రూమ్ ముందు ఆగి నన్ను క్షమించండి అని చెప్తుంది. ఆ తర్వాత గంగ తన ఇంటికి వెళ్తుంది. అక్కడ మణి తాళితో రెడీగా ఉంటాడు.
బలవంతంగా గంగ మెడలో తాళి కట్టబోతుంటే గంగ వాళ్ళ అమ్మ లక్ష్మి వచ్చి మణి మెడపై కత్తిపీట పెడుతుంది. దాంతో మణి భయపడుతాడు. ఈ పైడిరాజ్.. నీ కూతురితో నా పెళ్లి చేస్తానన్నాడు.. డబ్బులు తీసుకున్నాడు.. నా డబ్బు నాకు ఇవ్వండి అని మణి అడుగుతాడు. తరువాయి భాగంలో గంగ ఇంట్లో లేదని రుద్రకి తెలిసి తన ఇంటికి వస్తాడు. నేను మీకు మాటిచ్చాను.. నీ కూతురిని జాగ్రత్తగా చూసుకుంటానని అందుకే గంగని నా వెంట తీసుకొని వెళ్తున్నానని గంగ చెయ్యి పట్టుకొని రుద్ర తీసుకొని వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |